Site icon NTV Telugu

Ramayana: రామాయణ టీజర్ పై కొత్త అప్‌డేట్..!

Ramayana Bollywoood

Ramayana Bollywoood

భారతీయ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలీవుడ్ బారీ బడ్జెట్ మూవీ ‘రామాయణ’. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, మన ‘నేచురల్ బ్యూటీ’ సాయి పల్లవి సీతమ్మగా కనిపిస్తుండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక లంకేశ్వరుడు రావణుడిగా కన్నడ స్టార్ యష్ (Yash), హనుమంతుడిగా బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ పాత్రలను ఈ టీజర్‌లోనే పరిచయం చేయబోతున్నారు. అయితే తాజాగా టీజర్ గురించి ఓ అప్‌డేట్ వచ్చేసింది.

Also Read : Satya Krishnan: అవకాశాల కోసం లొంగిపోతున్నారు.. కాస్టింగ్ కౌచ్‌పై నటి బోల్డ్ కామెంట్స్..!

సమాచారం ప్రకారం హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 2, 2026న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారట. అంతే కాదు సుమారు 2 నిమిషాల 38 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ను ఇప్పటికే లాస్ ఏంజిల్స్‌లో ఒక స్పెషల్ షో వేశారు. అక్కడ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా విజువల్స్ చూసి నోరెళ్లబెడుతున్నారట. హాలీవుడ్ లెవల్‌లో గ్రాఫిక్స్ ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని హిందీతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా ఈ టీజర్‌ను ఒకేసారి విడుదల చేస్తున్నారు.

మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాకు ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మెర్ (ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ ఫేమ్) కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఎపిక్ ఫీల్‌ను ఇవ్వబోతోంది. మూడు భాగాలుగా రాబోతున్న ఈ రామాయణ గాథలో మొదటి పార్ట్‌ను 2026 దీపావళి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Exit mobile version