Satya Krishnan: అవకాశాల కోసం లొంగిపోతున్నారు.. కాస్టింగ్ కౌచ్‌పై నటి బోల్డ్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి సత్యకృష్ణ. ‘బొమ్మరిల్లు’, ‘వినాయకుడు’,‘దేవదాస్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. హోటల్ మేనేజ్‌మెంట్ చదివి, తాజ్ గ్రూప్‌లో ఉద్యోగం చేస్తూ యాదృచ్ఛికంగా నటిగా మారిన ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోని అంతర్గత విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Kiara Advani : అమ్మనయ్యాక.. అలా మారక తప్పలేదు..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
కాస్టింగ్ కౌచ్ గురించి సత్యకృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఉందని అందరూ అంటారు, కానీ నిజానికి ప్రతి రంగంలోనూ ఈ సమస్య ఉంది. ఇది ఒక ఓపెన్ ప్లాట్‌ఫామ్ కాబట్టి ఇక్కడి విషయాలు త్వరగా బయటకు వస్తాయి. అందంగా ఉండే మహిళల పట్ల ఆకర్షణ కలగడం సహజం, కానీ అవతలి వ్యక్తి లిమిట్స్ దాటుతున్నప్పుడు వెంటనే ‘నో’ అని చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. నాకు వ్యక్తిగతంగా ఇలాంటి అనుభవాలు ఎదురుకాకపోయినా, తోటి మహిళలు పడుతున్న ఇబ్బందులను చూశా.. ముఖ్యంగా సినిమా కాకపోతే నాకు లైఫ్ లేదు అని అనుకునే వాళ్లే అవకాశాల కోసం కాదనలేక లొంగిపోతున్నారు. అది సరైన పద్ధతి కాదు మనకు టాలెంట్ ఉంటే మరెన్నో అవకాశాలు వస్తాయి అనే నమ్మకం ఉండాలి. కొందరు మొదట అవకాశాల కోసం కమిట్‌మెంట్‌కు ఒప్పుకుని, ఆ తర్వాత దాన్ని రచ్చ చేయడం కూడా చూస్తున్నాం. ఏదైనా సరే, మన ప్రవర్తనను బట్టే ఎదుటివారు మనతో ప్రవర్తిస్తారు. బలవంతం చేసే సాహసం ఎవరూ చేయలేరు, ఒకవేళ చేసినా ఎదురుతిరిగే శక్తి ఉండాలి’ అని ఆమె స్పష్టం చేశారు. సత్యకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త అమ్మాయిలకు ఆమె చెప్పిన ‘ధైర్యం’ అనే సూత్రం ఎంతో స్ఫూర్తినిస్తోంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!