Site icon NTV Telugu

Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!

Ramayana Ranbeet Kapoor

Ramayana Ranbeet Kapoor

దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ ‘రామాయణ’పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఇటీవల విడుదలైన ‘రామ గ్లింప్స్’ విజువల్స్ చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్,ఎనిమిది సార్లు ఆస్కార్ గెలిచిన గ్రాఫిక్స్ స్టూడియోస్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయని మేకర్స్ ప్రచారం చేశారు. కానీ, వాస్తవానికి టీజర్‌లోని విజువల్స్ చాలా తక్కువ నాణ్యతతో, కృత్రిమ మేధ (AI) తో రూపొందించిన బొమ్మల్లా ఉన్నాయని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో మెప్పించినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ గ్రాఫిక్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి సినిమాకు తగవని విమర్శలు వస్తున్నాయి. అంతే కాదు

Also Read : Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

గతంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైనప్పుడు కూడా ఇలాంటి కార్టూనిష్ విజువల్స్ పై భారీ ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఆ సమయంలో దర్శకుడు ఓం రౌత్ ఆ విమర్శలను సీరియస్‌గా తీసుకుని, ట్రైలర్ సమయానికి విజువల్ ఎఫెక్ట్స్‌లో (VFX) భారీ మార్పులు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ‘రామాయణ’ మేకర్స్ ముందు కూడా అదే సవాలు ఉంది. సినిమా విడుదల కావడానికి ఇంకా సమయం ఉండటంతో, ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో లోపాలను సరిదిద్దుకుంటారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఇదే నాణ్యతతో సినిమా వస్తే మాత్రం, భారతీయ ప్రేక్షకుల సెంటిమెంట్‌ను గౌరవించడంలో టీమ్ విఫలమైందనే ముద్ర పడే అవకాశం ఉంది.

Exit mobile version