Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ ‘రామాయణ’పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఇటీవల విడుదలైన ‘రామ గ్లింప్స్’ విజువల్స్ చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్,ఎనిమిది సార్లు ఆస్కార్ గెలిచిన గ్రాఫిక్స్ స్టూడియోస్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయని మేకర్స్ ప్రచారం చేశారు. కానీ, వాస్తవానికి టీజర్‌లోని విజువల్స్ చాలా తక్కువ నాణ్యతతో, కృత్రిమ మేధ (AI) తో రూపొందించిన బొమ్మల్లా ఉన్నాయని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో మెప్పించినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ గ్రాఫిక్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి సినిమాకు తగవని విమర్శలు వస్తున్నాయి. అంతే కాదు
Also Read : Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!
Also Read
గతంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైనప్పుడు కూడా ఇలాంటి కార్టూనిష్ విజువల్స్ పై భారీ ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఆ సమయంలో దర్శకుడు ఓం రౌత్ ఆ విమర్శలను సీరియస్‌గా తీసుకుని, ట్రైలర్ సమయానికి విజువల్ ఎఫెక్ట్స్‌లో (VFX) భారీ మార్పులు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ‘రామాయణ’ మేకర్స్ ముందు కూడా అదే సవాలు ఉంది. సినిమా విడుదల కావడానికి ఇంకా సమయం ఉండటంతో, ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో లోపాలను సరిదిద్దుకుంటారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఇదే నాణ్యతతో సినిమా వస్తే మాత్రం, భారతీయ ప్రేక్షకుల సెంటిమెంట్‌ను గౌరవించడంలో టీమ్ విఫలమైందనే ముద్ర పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!