Site icon NTV Telugu

Ranbir Kapoor : రణబీర్ కపూర్‌పై మండిపడుతున్న హిందువులు.. పోలీసు కేసు నమోదు..

Ranabirkapoor

Ranabirkapoor

బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ హిందువుల సెంటిమెంటును దెబ్బతీశారని ఆరోపిస్తూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, ఆయన కుటుంబసభ్యులు వేడుకలు జరుపుకుంటూ కేక్ పై మద్యాన్ని పోసి నిప్పంటించి జై మాతా ది అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..

మాములుగా హిందువులు ఏదైనా పూజ చేసేటప్పుడు అగ్నిని ముందుగా ప్రార్దించి అనంతరం పూజను ప్రారంభం చేస్తారు.. కాగా, రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులు ఉద్ధేశపూర్వకంగా క్రైస్తవ మతం పండుగను జరుపుకునే సమయంలో మద్యాన్ని ఉపయోగించారు, జై మాతా ది అని నినాదాలు చేశారని ఫిర్యాదులో ముంబయికు చెందిన సంజయ్ తివారీ పేర్కొన్నారు. తన న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాల ద్వారా ముంబయిలోని ఘట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌లో నటుడు, అతని కుటుంబ సభ్యుల పై కంప్లైంట్ ఇచ్చారు..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో హిందువుల సెంటిమెంట్‌ను దెబ్బతీసినందుకు రణబీర్ కపూర్‌, అతని కుటుంబ సభ్యుల పై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఈ కేసులో ఇంకా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు కాలేదు. రణబీర్ కపూర్ తన మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని సంజయ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతనికి కొన్ని హిందు సంఘాలు కూడా మద్దతు తెలిపుతుండటంతో ఇప్పుడు ఈ విషయం పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది..

Exit mobile version