Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్‌ఫుల్ రోల్‌లోనూ ఆయనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రం గురించి రోజుకో సంచలన వార్త బయటకు వస్తోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా, నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ గురించి తాజాగా రణ్‌బీర్ పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ కేవలం శ్రీరాముడిగానే కాకుండా, మరో పవర్‌ఫుల్ రోల్‌లోనూ కనిపించబోతున్నారట.
READ ALSO: Ibrahimpatnam: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కిందంటే..?
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ఈ సినిమాలో తాను ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు రణ్‌బీర్ కపూర్ స్వయంగా వెల్లడించారు. శ్రీరాముడి పాత్రతో పాటు, విష్ణుమూర్తి ఆరో అవతారమైన పరశురాముడి పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నారట. “ఒకే సినిమాలో రాముడు, పరశురాముడు వంటి పురాణ పురుషుల పాత్రలు పోషించడం నా అదృష్టం. ఈ పాత్రల కోసం ఏడాది పాటు శ్రమించాను. కేవలం బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, వారి వెనకున్న ఆధ్యాత్మికతను కూడా అర్థం చేసుకున్నాను” అని రణ్‌బీర్ చెప్పుకొచ్చారు.
మరోవైపు, ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ‘రామాయణ’ రెండు భాగాల డిజిటల్ హక్కుల కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా రూ. 1000 కోట్ల భారీ ఆఫర్‌ను నిర్మాత నమిత్ మల్హోత్రా ముందు ఉంచిందట. అయితే, ఆయన ఈ డీల్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘ధురంధర్’ చిత్రబృందం అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్మాత భావిస్తున్నారు. మొదటి భాగం విడుదలయ్యాక వచ్చే రెస్పాన్స్‌ను బట్టి, రెండో భాగానికి మరింత భారీ ధరకు డీల్ కుదుర్చుకోవచ్చని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం దాదాపు రూ.4000 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుని వీఎఫ్ఎక్స్ (VFX) పనుల్లో ఉంది. ఇందులో రణ్‌బీర్ సరసన సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అలాగే కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..