Site icon NTV Telugu

Ranbir Kapoor-Alia Bhatt: భార్యతో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన రణభీర్.. అదే హైలెట్..

Aliyaaa

Aliyaaa

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ రణభీర్ కపూర్, అలియాభట్ గురించి అందరికీ తెలుసు.. బాలీవుడ్ మాత్రమే కాదు.. తెలుగులో కూడా వీరిద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది.. తాజాగా వీరిద్దరు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.. 69 వ ఫిలింఫేర్‌ అవార్డుల్లో ఇద్దరూ ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్లుగా పురస్కారాలు అందుకున్నారు.. అంతేకాదు వీరిద్దరూ చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ దంపతులు డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకున్నారు.. రణభీర్ రీసెంట్ గా నటించిన యానిమల్ చిత్రంలోని ‘జమల్‌ కుదు’ హుక్‌ స్టెప్‌ను రీక్రియేట్‌ చేశారు.. స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ స్టేజ్ కింద కూర్చున్న భార్య దగ్గరకు వచ్చి చిందులేశాడు. తలపై గ్లాసు పెట్టుకుని డ్యాన్స్‌ చేశాడు. దీంతో ఆలియా కూడా భర్తతో కలిసి స్టెప్స్ వేసాడు.. అంతేకాదు వారి మధ్య ఉన్న ప్రేమను మరోసారి అందరికీ తెలిసేలా చేశారు.. ఆఫ్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు..

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మీ జంటను చూస్తే ముచ్చటేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘యానిమల్‌’ సినిమాకుగానూ రణ్‌బీర్‌ ఉత్తమ నటుడిగా, ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహాని’ సినిమాకి గానూ అలియాభట్ కు ఉత్తమ యాక్టర్స్ అవార్డులను అందుకున్నారు.. ఇక ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..

Exit mobile version