Site icon NTV Telugu

Rana Naidu: Season 2: ‘రానా నాయుడు’ సీజన్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది.. ఈసారి మొత్తం..!

Rana Naidu Season 2

Rana Naidu Season 2

విక్టరీ వెంకటేశ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. దీనికి సీక్వెల్‌గా ‘రానా నాయుడు 2’ సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా జూన్‌ 13 నుంచి సీజన్ 2 హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. సీజ‌న్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో రానా నాయుడు సీజ‌న్ 2 ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్ చేసింది.

సీజన్‌ 1కు మించి వినోదం, థ్రిల్‌ను పంచడానికి సీజన్‌ 2 సిద్ధమైనట్లు ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతోంది. ఈ ట్రైలర్‌ కట్‌లో బోల్డ్‌ సీన్స్‌ లేవు. సీజన్‌ 1 విడుదలైనప్పుడు వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని.. సీక్వెల్‌లో బోల్డ్‌ కంటెంట్‌ను తగ్గిస్తామని ఇప్పటికే టీమ్‌ చెప్పిన విషయం తెలిసిందే. తాజా ట్రైలర్‌ మొత్తం యాక్షన్‌ డ్రామాగా ప్రేక్షకులను అలరించనుంది. వినోదం, థ్రిల్లింగ్ అంశాలు అంచ‌నాల‌ని పెంచేశాయి.

Also Read: IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ.. ఆందోళనలో ఆర్సీబీ ఫ్యాన్స్!

రానా నాయుడు సిరీస్‌కు కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ వర్మ, అభయ్‌ చోప్రా దర్శకత్వం వచించారు. సుందర్‌ ఆరోన్, లోకోమోటివ్‌ గ్లోబల్‌ మీడియా సంయుక్తంగా నిర్మించింది. సీజన్‌ 2లో అర్జున్‌ రాంపాల్, కృతి కర్బందలు ఎంట్రీ ఇచ్చారు. హాట్ భామ సుర్వీన్‌ చావ్లా, సుశాంత్‌ సింగ్, డినోమోరియా, అభిషేక్‌ బెనర్జి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version