Rana Naidu: Season 2: ‘రానా నాయుడు’ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి మొత్తం..!
- జూన్ 13 నుంచి రానా నాయుడు సీజన్ 2 స్ట్రీమింగ్
- రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది
- సీజన్ 1కు మించి వినోదం, థ్రిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. దీనికి సీక్వెల్‌గా ‘రానా నాయుడు 2’ సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా జూన్ 13 నుంచి సీజన్ 2 హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సీజన్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.
సీజన్ 1కు మించి వినోదం, థ్రిల్‌ను పంచడానికి సీజన్ 2 సిద్ధమైనట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ ట్రైలర్ కట్‌లో బోల్డ్ సీన్స్ లేవు. సీజన్ 1 విడుదలైనప్పుడు వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని.. సీక్వెల్‌లో బోల్డ్ కంటెంట్‌ను తగ్గిస్తామని ఇప్పటికే టీమ్ చెప్పిన విషయం తెలిసిందే. తాజా ట్రైలర్ మొత్తం యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను అలరించనుంది. వినోదం, థ్రిల్లింగ్ అంశాలు అంచనాలని పెంచేశాయి.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
Also Read: IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ.. ఆందోళనలో ఆర్సీబీ ఫ్యాన్స్!
రానా నాయుడు సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వచించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ మీడియా సంయుక్తంగా నిర్మించింది. సీజన్ 2లో అర్జున్ రాంపాల్, కృతి కర్బందలు ఎంట్రీ ఇచ్చారు. హాట్ భామ సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, డినోమోరియా, అభిషేక్ బెనర్జి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!