Rana Daggubati: ఇదివరకు బాలీవుడ్ హీరోలు సౌత్ ఇండియన్స్ హీరోలని చాలా చులకన భావంతో చూసిన సంఘటనలు చూసాము. ఈ మధ్యకాలంలో అనిల్ అంబానీ చిన్న కుమారుడు వివాహ కార్యక్రమంలో భాగంగా హీరో రామ్ చరణ్ ని కూడా పలు వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ హీరో షారుఖ్. ఆ వార్త అప్పట్లో పెద్ద సెన్సేషన్ గా మారింది కూడా. ఇకపోతే తాజాగా మేము సౌత్ ఇండియన్స్.. మా సంస్కృతి ఇలానే ఉంటుంది.. అంటూ రానా దగ్గుబాటి చెబుతూ షారుక్ ఖాన్, పక్కనే ఉన్న బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కాళ్ళను ముక్కాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Rahul Gandhi : అమెరికాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్
ఐఫా 2024 ఫ్రీ ఈవెంట్ లో భాగంగా రానా ఈ పని చేశాడు. అతి త్వరలో ఐఫా 2024 అవార్డుల వేడుక జరగనుంది. ఇందుకోసం ముంబై నగరంలో మంగళవారం స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు నిర్వాహకులు. ఇందులో భాగంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో పాటు.. దగ్గుబాటి రానా, దర్శకుడు కరెన్ జోహార్, సిద్ధాంతి చతుర్వేది, అభిషేక్ బెనర్జీ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ ఈ తరం వాళ్లు పెద్దవాళ్ల కాళ్లు ఎలా మొక్కుతారో చెబుతూ ఫన్నీ కామెంట్ చేశాడు. ఆ తర్వాత స్టేజిపై మాట్లాడడానికి వచ్చిన దగ్గుబాటి రానా మొదట షారుక్ ఖాన్ హాగ్ చేసుకుని ఆ తర్వాత తాను పూర్తిగా సౌత్ ఇండియన్ అని చెబుతూ.. కాళ్లు తాము ఇలా మొక్కుతాము అంటూ షారుఖ్ ఖాన్, జోహార్ కాళ్ళను మొక్కాడు. దగ్గుబాటి రానా చేసిన ఈ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Semicon India 2024: నేడు సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
రానా చేసిన పనికి షారుక్ ఖాన్ నవ్వుతూ.. అతన్ని హాగ్ చేసుకున్నాడు. దగ్గుబాటి రానా కాళ్లు మొక్కే సమయంలో అక్కడున్న ఆడియన్స్ పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో అతడికి స్వాగతించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోకు సంబంధించి పలువురు భిన్న రకాలుగా కామెంట్ చేస్తున్నారు.