NTV Telugu Site icon

Rana Naidu : ఈ సారి బూతులు కాస్త తగ్గించాం.. కానీ..

Rana Naidu 2 Update

Rana Naidu 2 Update

Rana Naidu : దగ్గుబాటి రానా హోస్ట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో ఓ స్పెషల్ టాక్‌ షో రాబోతుంది. ‘ది రానా దగ్గుబాటి షో’ అనే పేరుతో రాబోతున్న ఈ టాక్‌ షో ప్రమోషన్లలో భాగంగా రానా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నారు. రానా వరుసగా సినిమాలు చేయక పోవడానికి కారణం మంచి కథలు రాకపోవడమంటూ చెప్పుకొచ్చాడు. లీడర్‌, నేనే రాజు నేనే మంత్రి లాంటి మంచి కథలు వస్తే తను తప్పకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అంతే కాకుండా తన నుంచి సినిమాలు, సిరీస్‌లు, ఇలాంటి షోలు రెగ్యులర్‌గా వస్తాయని, తాను అన్ని విధాలుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించాడు.

Read Also:Mallu Bhatti Vikramarka: ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు.. బట్టి విక్రమార్క కౌంటర్..

రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ తో ఆయన ఓటీటీ వెబ్‌ సిరీస్‌లో అడుగు పెట్టిన విషయం కూడా తెలిసిందే. బాబాయి వెంకటేష్ తో కలిసి రానా ఆ వెబ్‌ సిరీస్‌లో నటించారు. నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయిన రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ ను ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా లేదన్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ అంతా కలిసి వెంకటేష్, రానా సిరీస్‌ చూడాలని కోరుకుంటే అందులో మరీ దారుణంగా బూతులు ఉన్నాయని విమర్శలు కూడా వచ్చాయి. ఆ విషయమై రానా తాజాగా మాట్లాడుతూ.. రానా నాయుడు విమర్శలపై స్పందించాడు. బూతుల విషయంలో స్పష్టత ఇచ్చాడు.

Read Also:G20 Summit: జీ20 సదస్సులో ఫోటో షూట్.. కనిపించని బైడెన్‌, ట్రూడో, మెలోనీ..!

ఆ వెబ్ సిరీస్ స్ట్రీమింగుకు ముందే తాము బూతులు ఉంటాయని.. ఫ్యామిలీతో కలిసి చూడలేరని ప్రకటించామన్నారు. కానీ కొందరు యూత్‌ ఫ్యామిలీతో కలిసి చూసి ఇబ్బంది పడ్డారు. దానికి తాము విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2 కొనసాగుతోంది. ఇప్పటికే షూటింగ్‌ను ముగించామని రానా తెలిపారు. త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను ముగించుకుని స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. దాని స్ట్రీమింగ్‌ తేదీ పై తన వద్ద ఎలాంటి సమాచారం లేదు అన్నట్లుగా రానా స్పందించారు. సీజన్ పై గురించి మాట్లాడుతూ మరింత ఆకర్షణీయంగా ఉంటుందని హామీ ఇచ్చారు. మొదటి సీజన్‌లా బూతులు ఉండవు అని, సీజన్ 2 లో కాస్త బూతులు తగ్గించినట్లు ప్రకటించారు. సీజన్ 2 ను ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటుంది అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.