ఖర్జూరాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. తియ్యగా ఉంటాయి అందుకే చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరు ఇష్టంగా తింటారు..అయితే వీటిని రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మనకు చాలామందికి తెలియని విషయం ఒకటుంది.. రంజాన్ మాసంలో వీటిని ఎందుకు తింటారో అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వీటిని రంజాన్ లో తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి వస్తుంది.. రోజంతా ఆహారం తీసుకోకపోవడంతో శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల ఖర్జూరాలను తినడం వల్ల బలాన్ని అందిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమించడానికి ఇదే ముఖ్య కారణం..అయితే ఈ ఖర్జూరాలను ఎక్కడ ఎక్కువగా పండిస్తారో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేసే దేశం ఈజిప్ట్. ఈ దేశంలో ఏడాదికి దాదాపు 1,733,432 టన్నుల ఖర్జూరాన్ని ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి.. ఆ తర్వాత రెండో స్థానంలో అరబిక్ దేశాలు ఉన్నాయి.. వీటిని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. ఏడాదికి 1,610,731 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఇక మూడో స్థానంలో అల్జీరియా.. ఏడాదికి 1,247,403 టన్నుల ఖర్జూరాలను సాగు చేస్తుంది.. అలాగే నాల్గవ స్థానంలో ఇరాన్ ఉంది ఈ దేశాలు ఖర్జూరాలను సాగు చేసి వేరే దేశాలకు ఎగుమతి చేస్తారు..