Site icon NTV Telugu

Divya Spandana: ప్రముఖ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన మృతి.. తూచ్ అంతా ఉత్తదే

Divya Spandana

Divya Spandana

Divya Spandana: చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొంత కాలంగా చాలా మంది ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు, డ్యాన్స్ మాస్టర్లు ఇలా చాలా మంది కాలం చేశారు. కరోనా టైంలో కొందరు మరణిస్తే.. మరికొందరు ఇతర కారణాలతో కన్నుమూశారు. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్యా స్పందన (40) హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు సమాచారం అందుతోంది. తను మృతి చెందినట్లు జాతీయ మీడియా గుర్తించింది. ఇక కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్యా స్పందన మృతి నేపథ్యంలో ఆమెను పలువురు సంతాపం తెలిపారు.

Read Also:Anushka Shetty : ఇక నుంచి అలాంటి కథలకు దూరంగా వుంటాను.

కానీ ఇదంతా పుకార్లని తేలిపోయింది. కన్నడ నటి దివ్య స్పందన గుండెపోటుతో మృతి చెందారని సోషల్ మీడియాలో చాలా మంది RIP అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఈ రూమర్స్‌ రావడం పలువురిని షాక్‌కి గురి చేసింది. దివ్య స్పందన శింబు, ధనుష్, సూర్యతో పలు సినిమాల్లో నటించారు. గతంలో ఎంపీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కుత్తు రమ్య పేరుతో ఇండస్ట్రీలో ఆమె చాలా పాపులరిటీ సంపాదించుకున్నారు. ధనుష్‌తో పొల్లదవన్ సినిమాలో నటించారు.

Read Also:Prashanth Neel: నీలకంఠాపురం దేవస్థానాన్ని సందర్శించిన కేజీఎఫ్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ నీల్

దివ్య స్పందన నవంబర్ 29, 1982న జన్మించారు. ఆమె స్క్రీన్ నేమ్ రమ్య ద్వారా విస్తృతంగా గుర్తింపు పొందింది. ఆమె కర్ణాటకలోని మాండ్యాకు ప్రాతినిధ్యం వహిస్తూ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. తన విశేషమైన ప్రతిభ ఆమెకు రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, ఒక ఉదయ అవార్డు, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్‌తో సహా అనేక ప్రశంసలను సంపాదించిపెట్టింది.

Exit mobile version