NTV Telugu Site icon

Ramoji Rao: రామోజీరావు స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు..

Pedaparupudi

Pedaparupudi

Ramoji Rao: మీడియా దిగ్గజం, ప్రముఖ వ్యాపార్తవేత్త రామోజీరావు కన్నుమూశారు.. ఆయన మరణం అందరినీ కదిలిస్తోంది.. ఇక, రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామర్రులోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. రామోజీ రావు మరణ వార్త విని శోకసముద్రంలో మునిగిపోయారు గ్రామస్తులు. ఈ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు రామోజీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు… జోహార్ రామోజీరావు అంటూ గ్రామ సెంటర్లో నినాదాలు చేశారు గ్రామస్తులు. పెదపారుపూడిని దత్తత తీసుకొని.. 20 కోట్లకు పైగా సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారు రామోజీరావు. విద్యార్థి దశ నుండే రామోజీరావుకు కష్టపడి తత్వం ఉండేది అని ఆయన బాల్యమిత్రుడు పాలడుగు చంద్రశేఖర రావు గుర్తుచేసుకున్నారు.. దేశంలోనే గొప్ప స్థాయికి చేరుకున్నా.. పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా సేవలు చేశారని కొనియాడారు చంద్రశేఖర్‌రావు.

Read Also: Ramoji Rao: మోడీ ప్రమాణ స్వీకారం ఉన్నా ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరిన పవన్

ఇక, గత ప్రభుత్వం సహకరించకపోయిన.. దత్తత గ్రామమైన పెదపారుపూడి కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు సర్పంచ్ చప్పిడి సమీరా… ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పెదపారుపూడిని మోడల్ గ్రామంగా రామోజీరావు అభివృద్ధి చేశారని రామోజీ ఫౌండేషన్ సభ్యులు అంటున్నారు.. గ్రామంలో స్మశానాల దగ్గర నుండి… ప్రభుత్వ పాఠశాలల వరకు గ్రామంలో ఎన్నో నిర్మాణాలు చేశారని కొనియాడారు.. రామోజీరావు చివరి దశలో మాజీ సీఎం వైఎస్‌ జగన్.. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎంతో వేధించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీతో భేటీ

కాగా, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించారు రామోజీరావు… తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు.. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చారు.. ఒక రైతు బిడ్డ అయిన చెరుకూరి రామోజీరావు.. వ్యాపారవేత్తగా, ఈనాడు గ్రూపు సంస్థల అధినేతగా. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడుగా, ప్రధాన సంపాదకుడిగా, ప్రచురణ కర్తగా పనిచేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత ఆయన.. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ.. 2016లో దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం..