NTV Telugu Site icon

Paris Olympics 2024: రెండో రోజు భారత్ శుభారంభం..ఫైనల్ కి చేరిన టీంలు..

Ramita Jindal

Ramita Jindal

పారిస్ ఒలింపిక్స్ మొదటి రోజు భారత్ ఎలాంటి పతకాన్ని గెలవలేదు. రెండో రోజు భారత్ ఖాతా తెరుచుకోవచ్చని భావిస్తున్నారు. తొలిరోజు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ రోజు మను పతక పోరులో మరో 7 మంది షూటర్లతో పోటీపడుతోంది. రియో, టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్‌ పీవీ సింధు అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది.

READ MORE: Tamil Nadu: తమిళనాడులో మరో రాజకీయ హత్య.. ఏఐడీఎంకే నేత మర్డర్..

ఫైనల్ కి చేరిన రమితా జిందాల్‌
పారిస్ ఒలింపిక్స్‌ లో తొలిరోజు టీమ్‌ ఈవెంట్‌లో నిరాశపరిచిన షూటర్‌ రమితా జిందాల్‌ రెండో రోజు అద్భుత ప్రదర్శన కనబరిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల సింగిల్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్స్ లో చోటు దక్కించుకుంది. ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరి భారత్ పతక ఆశలను పెంచింది. గేమ్‌లో మొదటి రోజు.. మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో క్వాలిఫయర్స్‌లో మూడవ స్థానం సాధించి ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

READ MORE:Womens Asia Cup Final: శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్

ఆర్చరీలో కూడా..
ఆర్చరీలో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. నెదర్లాండ్స్ తన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను ఓడించింది. ర్యాంకింగ్ రౌండ్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. భారత జట్టులో దీపికా కుమారి, అంకితా భకత్, భజన్ కౌర్ ఉన్నారు.