కూర్చుని తింటే.. రాళ్లయినా కరిగిపోతాయి. ఆఫ్టర్ ఆల్ ఆస్తులు ఎంత? అనుకున్నాడో ఏమో.. భారీగా ఆస్తులు కూడబెట్టాలని, డబ్బులు సంపాదించాలని రంగంలోకి దిగాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. డబ్బు సంపాదన కోసం అతడు ఎంచుకున్న మార్గమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ అతను డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు? హవ్ ఏ లుక్.
ఇతని పేరు.. రమేష్ గౌడ్. చేసేది వడ్డీ వ్యాపారం.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 4 భవనాలు ఉన్నాయి. వాటి ద్వారా అద్దె కూడా లక్షల్లో వస్తుంది. మొత్తంగా ఈ వ్యక్తి కోటీశ్వరుడు అని చెప్పవచ్చు. కోట్లలో సంపాదన, రోజూ లక్షల్లో లావాదేవీలు చేసే రమేష్ గౌడ్.. డబ్బులు ఊరికే రావు అనుకున్నాడో ఏమో గలీజ్ దందాకు తెరతీశాడు. రమేష్ గౌడ్ దగ్గర ఉన్న బ్యాగ్‌లో చూడగా.. 4.5 కిలోల గంజాయి పట్టుబడింది. మనోడు డబ్బు బాగా సంపాదించాలని ఈ అడ్డదారిలోకి వచ్చాడు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తెప్పిస్తూ కన్జూమర్లకు అమ్ముతున్నాడు. ఇప్పుడు పక్కా సమాచారంతో నారాయణ గూడ ఎక్స్ రోడ్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. మల్లాపూర్ నుంచి కోఠి వైపు గంజాయి తీసుకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. అతని వద్ద 20 వేల రూపాయలతోపాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Crime News: కన్న తండ్రే కాలయముడు.. కూతురును రివాల్వర్‌తో కాల్చిన కసాయి!
మొత్తానికి డబ్బులు బాగా సంపాదించాలని.. రమేష్ గౌడ్ గంజాయి స్మగ్లింగ్‌తో అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.
