Ramcharan : మెగా కుటుంబంలోకి రాంచరణ్ కూతురు క్లింకారా ఓ అదృష్టంలా కలిసి వచ్చింది. క్లింకారా రాకతో మెగా కుటుంబం మరింత సంతోషంగా వుంది.. తన గారాల పట్టీని చూసుకుంటూ రాంచరణ్ మురిసిపోతున్నాడు. అయితే రాంచరణ్,ఉపాసన ఇప్పటికే పలుమార్లు క్లింకారా ఫోటోలు బయట పెట్టినా కూడా ఎక్కడా తన ఫేస్ చూపించలేదు తాజాగా నేడు ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ నేషనల్ మీడియాకు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఈ ఇంటర్వ్యూలో క్లింకారా రాకతో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేసాడు.అయితే ఈ నేపథ్యంలో రాంచరణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read Also :Ram Charan- KlinKaara : ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ ఫోటో చూశారా?
దాదాపు 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడ్డాను.టైమింగ్స్ తో సంబంధం లేకుండా వరుసగా షూటింగ్స్ కు హాజరు అయ్యేవాడిని.కానీ ఇకపై నా కూతురు క్లింకారా కోసం టైం స్పెండ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాను.తన కూతురు కోసం కొన్నాళ్ళు నెమ్మదిగా సినిమాలు చేస్తాను అని రాంచరణ్ తెలిపారు.వరుస షూటింగ్స్ వల్ల క్లింకారా ను వదిలి వెళ్లలేకపోతున్నాను.తనకు నేను బానిసను అయిపోయాను అని రాంచరణ్ తెలిపారు.షూటింగ్స్ వెళ్తే తనని మిస్ అవుతాను. అందుకే ఇకపై లోకల్ లో షూటింగ్ ఉంటే మాత్రం సాయంత్రం 6 గంటలకు పూర్తి చేసి ఇంటికి వెళ్తాను అని రాంచరణ్ తెలిపారు. నా నిర్మాతలకు కూడా ఈ విషయం చెబుతాను అని రాంచరణ్ తెలిపారు..క్లింకారా బ్యాగ్ తీసుకోని స్కూల్ కి వెళ్లెవరకూ తన షూటింగ్ షెడ్యూల్ ఇలానే ఉంటుందని రాంచరణ్ తెలిపారు.