Site icon NTV Telugu

Ramcharan : సనాతన ధర్మం పై వైరల్ అవుతున్న రాంచరణ్ పాత ట్వీట్..

Whatsapp Image 2023 09 05 At 1.22.05 Pm

Whatsapp Image 2023 09 05 At 1.22.05 Pm

తమిళ నటుడు మరియు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి స్టాలిన్  సనాతన ధర్మం పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీనితో ఆయనపై దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.తమిళనాడు మంత్రిగా బాధ్యత గల పదవి లో వున్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు అంటూ హిందూ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పలు చోట్ల హిందూ సంఘ నాయకులు ఉదయనిధి స్టాలిన్ పై కేసులు కూడా పెడుతున్నారు.. ఉదయనిధి స్టాలిన్ ని సినీ అభిమానులు కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఇటీవల నటించిన మామన్నన్ చిత్రం మంచి విజయం సాధించింది.

ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్.. డెంగ్యూ, మలేరియా ఎలాగో.. సనాతన ధర్మం కూడా అంతే. మనం కేవలం దానిని వ్యతిరేకించి ఊరుకోకూడదు దానిని నిర్మూలించాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే ఈ తరుణంలో సనాతన ధర్మం పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేసిన పాత ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.2020లో రాంచరణ్ ‘సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాద్యత.. భారతీయ కల్చర్ మ్యాటర్స్ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో తన తల్లి సురేఖ తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫోటోని కూడా రాంచరణ్ షేర్ చేశారు. అయితే ప్రస్తుతం సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ నేపథ్యంలో చరణ్ ట్వీట్ ని నెటిజన్లు బాగా వైరల్ చేస్తున్నారు.సనాతన ధర్మం పట్ల భాద్యత గల పదవిలో వున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు మెగా పవర్ స్టార్ రాంచరణ్ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూడండి అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.. సనాతన ధర్మాన్ని పాటించాలి అంటూ వ్యాఖ్యలు చేసిన రాంచరణ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉదయనిధి స్టాలిన్ ను నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

https://twitter.com/AlwaysRamCharan/status/1304400109568892929?s=20

Exit mobile version