కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.ఆయితే తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో కనిపించాడన్న వార్త మరోసారి తెరపైకి వచ్చింది. నిజానికి గతంలో ఓసారి ఈ వార్త వినిపించిన తర్వాత ఫేక్ అని తేలిపోయింది..కానీ తాజాగా రాంచరణ్ పేరు మరోసారి లియో మూవీతో లింకవడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో ప్రారంభమయ్యాయి. అందులో ఓ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ లియో మూవీలోని నటీనటుల వివరాలు చెబుతూ.. రామ్ చరణ్ పేరు కూడా రాయడం గమనార్హం. ఈ వెబ్‌సైట్లోని సమాచారం తప్పయ్యే అవకాశం కూడా ఉన్నది.కానీ ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం అభిమానులకు పండగనే చెప్పాలి.దళపతి విజయ్, రామ్ చరణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు పండుగ లా ఉంటుందనడంలో సందేహం లేదు.
ఆ టికెట్ బుకింగ్ వెబ్ సైట్లో జోసెఫ్ విజయ్ పేరుతోపాటు రామ్ చరణ్, త్రిష, అనురాగ్ కశ్యప్, గౌతమ్ మేనన్, అర్జున్ సర్జా, మాథ్యూ థామస్, సంజయ్ దత్ పేర్లు ఉన్నాయి.లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన లియో మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగ రాయడం ఖాయం గా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. గతేడాది లోకేష్ డైరెక్ట్ చేసిన విక్రమ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినిమాటిక్ యూనివర్స్ తరహాలో లియో మూవీ తెరకెక్కినట్లు సమాచారం..ఈ సినిమాలో కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు నటించారు.ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కూడా తోడైతే అది మరో లెవల్లో ఉంటుంది..రీసెంట్ గా లియో మూవీ ట్రైలర్ విడుదల అయింది.. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు