Site icon NTV Telugu

Ramanami: ఒళ్లంతా రామ నామాలే పచ్చబొట్లు.. ఇక్కడి ప్రజల వింత ఆచారం..

Ramanamis

Ramanamis

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కస్‌డోల్‌కు చెందిన గులారామ్ రామనామీ ఇప్పుడు ‘బడే భజన్ మేళా’ కోసం రెడీ అవుతున్నారు. సుమారు వందేళ్లుగా ఏటా మహానది తీరాన ‘బడే భజన్ మేళా’ నిర్వహిస్తున్నారు.. మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో వేల మంది ఒకే చోట చేరి.. రామచరిత మానస్‌ తో పాటు రామ నామం గురించి భజన చేస్తారు.. ఈ సారి జనవరి 21 నుంచి 23 మధ్య బడే భజన్ మేళా నిర్వహిస్తున్నారు.

Read Also: Ayodhya Ram Mandir : భూకంపం వచ్చినా 1000ఏళ్లు నిలిచేలా నిర్మించిన రాములోరి ఆలయం.. ఎలా కట్టారంటే ?

కాగా, గులారామ్ రామనామీ మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు వేల మంది రామనామీలు రామాయణంలోని కీర్తనలు ఆలపించి, రామాయణాన్ని కళ్లకు కట్టేలా ప్రదర్శన నిర్వహిస్తారు అని చెప్పాడు. ఈసారి మేం మేళా నిర్వహించే సమయానికి అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతోంది అని చెప్పాడు. రామ నామాన్ని శరీరమంతా శాశ్వతమైన పచ్చబొట్లుగా వేయించుకునే రామనామీల తెగ మాది అని గులారామ్ పేర్కొన్నారు. ‘నఖశిఖ’ పర్యంతం అంటే తల మొదలుకొని కాలిగోరు వరకు శరీరంపై రామ నామాన్ని పచ్చబొట్లుగా వేయించుకుంటారు ఈ తెగకు చెందిన ప్రజలు.. ఈ తెగలో ఉదయం పలకరింపు రామ్-రామ్ అంటూ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి రోజంతా ఏ పని చేసినా రామనామాన్ని స్మరిస్తారు. విగ్రహారాధనను విశ్వసించని రామనామీ తెగలోని ప్రజలు నిర్గుణ రాముడి రూపాన్ని భజనల రూపంలో రామచరిత్ మానస్‌లోని పద్యాలను ఆలపిస్తూ ఆరాధిస్తున్నారు.

Exit mobile version