NTV Telugu Site icon

Gottipati Ravikumar: రామయ్య సాహసమే ఉద్యోగులకు స్పూర్తి.. లైన్మెన్ను అభినందించిన మంత్రి

Gottipati Ravikumar

Gottipati Ravikumar

సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఇందుకు లైన్ మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన కొనియాడారు. ప్రజావసరాలను తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించామని చెప్పారు. భారీ వర్షాలకు అల్లూరి జిల్లా సున్నంపాడు, దేవరపల్లికి విద్యుత్ నిలిచిపోయింది. అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో ప్రజాసంబంధాలను కోల్పోయారు.

Read Also: Astrologer: బైడెన్ తప్పుకుంటాడని చెప్పిన ఆస్ట్రాలజర్ జోస్యం నిజమైంది.. తదుపరి యూఎస్ అధ్యక్షుడు ఎవరంటే..?

ఈ తరుణంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న లైన్ మెన్ కూర రామయ్య వరద ఉద్ధృతిని కూడా లెక్క చేయకుండా… విద్యుత్ పునరుద్దరణే లక్ష్యంగా తీగలపై నడుచుకుంటూ వాగు దాటి విద్యుత్ సేవలను అందించారు. విధి నిర్వహణలో రామయ్య చూపిన సాహసం, తెగువ అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఇది ఎంతో మంది ఉద్యోగులకు ఆదర్శమని, మరెంతో మందిలో చైతన్యం నింపుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

Read Also: Paris Olympics 2024: మహిళల 50 కేజీల విభాగంలో ప్రీ-క్వార్టర్‌ఫైనల్స్కు నిఖత్..

ఇటీవల ఏపీలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో.. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ పలు గ్రామాలు వరదల్లోనే ఉన్నాయి.