MLA Purchasing Case: ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్‌లకు షౌకత్ నగర్ పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్ పీఎస్‌కు తీసుకొచ్చారు. ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన రామచంద్ర భారతి, నందకుమార్‌లు బయటకు రాగానే టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందకుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో చీటింగ్ కేసు నమోదు కాగా, రామచంద్ర భారతిపై నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, నకిలీ ఆధార్ కార్డు కేసు నమోదైంది. ఈ కేసుల నేపథ్యంలో పోలీసులు వారిని బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించినట్లు సమాచారం. జైలు నుంచి విడుదలైన వెంటనే రామచంద్ర భారతి, నందకుమార్‌లను పోలీసులు అరెస్టు చేయడంపై నందకుమార్ స్పందించారు. నందకుమార్ 45 రోజులుగా జైలులో ఉన్నారని, తనకు ఏం జరుగుతుందో తెలియడం లేదని అన్నారు. ఈ కేసులను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడతానని స్పష్టం చేశారు.
Read also: Dy.CM Narayana Swamy : రాష్ట్రంలో జగన్ మాత్రమే బీసీల పక్షపాతి
ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు డిసెంబర్ 1న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.అయితే బెయిల్ మంజూరులో హైకోర్టు కొన్ని షరతులు విధించింది. ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రూ.3 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. ముగ్గురి పాస్ పోర్టులను కోర్టులో సరెండర్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు పేర్కొంది. అలాగే సాక్షులను ప్రభావితం చేయవద్దని కోర్టు ఆదేశించింది.
Gujarat Election Results 2022: గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్..