NTV Telugu Site icon

SS Rajamouli: రాజమౌళి ఎవరినీ వదిలిపెట్టడు.. రమా రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!

Rama And Rajamouli

Rama And Rajamouli

Prabhas, NTR and James Cameron Comments on SS Rajamouli in Documentary: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’ ఓ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ పేరుతో తెరకెక్కిన డాక్యుమెంటరీలో దర్శకధీరుడి సినీ ప్రయాణాన్ని (స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి ప్రయాణం) చూపించనున్నారు. ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రైలర్‌లో టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినీ ప్రముఖులు రాజమౌళిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఎస్ఎస్ రాజమౌళిపై హాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదని పేర్కొన్నారు. ‘రాజమౌళి అంటే నాకెంతో గౌరవం. ఆయాకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరితోనైనా ఈజీగా పని చేయగలరు. ఎక్కడైనా, ఎవరితోనైనా అద్భుతాలు సృష్టించగలడు’ అని కామెరూన్‌ అన్నారు. ‘ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలు అంటే ఆయనకు పిచ్చి’ అని రెబల్ స్టార్ ప్రభాస్‌ చెప్పారు.

Also Read: Today Gold Rate: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!

‘రాజమౌళి సినిమాల కోసమే పుట్టాడు. ఇప్పటివరకు ఎవరూ చూపని కథలను ప్రపంచానికి చెబుతున్నాడు’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. ‘రాజమౌళి సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను. మైకులు బద్దలవుతాయి’ అని మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు. ‘రాజమౌళి ఓ లెజెండ్. ఇంకా పెద్ద లెజెండ్ అవుతాడు’ అని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోకర్ చెప్పుకొచ్చారు. ‘రాజమౌళి ఓ పనిరాక్షసుడు. ఆయనకు కావాల్సింది వచ్చే వరకు.. ఎవరినీ వదిలిపెట్టడు. షాట్స్ తీస్తూనే ఉంటాడు’ అని రమా రాజమౌళి పేర్కొన్నారు. ఇలా అందరి మాటలతో మోడ్రన్‌ మాస్టర్స్‌ ట్రైలర్ ఆసక్తిగా సాగింది.

Show comments