Ram Pothineni: నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వెండితెరపై విజయవంతంగా రెండు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ‘దేవదాసు’తో మొదలైన ఈ ప్రయాణంలో లవర్ బాయ్‌గా, మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఇప్పుడు తనలోని ప్రతిభను బయటకు తీస్తున్నారు. గతేడాది విడుదలైన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంతో థియేటర్లలో సందడి చేసిన రామ్, ఆ సినిమా కోసం తొలిసారి గీత రచయితగా మారి పాట రాయడమే కాకుండా స్వయంగా పాడి అభిమానులను మెప్పించారు. దీంతో..
Also Read : Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
తాజా సమాచారం ప్రకారం, రామ్ ఇప్పుడు తొలిసారి కథా రచయితగా తన ప్రతిభను చాటుకోబోతున్నారు. ఇప్పటికే ఒక వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్న ఆయన, దాన్ని పట్టాలెక్కించేందుకు సరైన దర్శకుడి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఒక హీరోనే స్వయంగా కథ రాసుకోవడం అనేది సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే లోకేశ్ కనగరాజ్ శిష్యుడు లోగి విఘ్నేశ్‌తో రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి లోగి విఘ్నేశ్ దర్శకత్వంలో రాబోయే సినిమానే రామ్ రాసుకున్న కథతో ఉంటుందా? లేక మరో దర్శకుడితో ఆ కథను పట్టాలెక్కిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని గురించి వచ్చే నెల (మే) 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్, ఆయన రచయితగా మారడంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన 20 ఏళ్ల అనుభవంతో రామ్ ఎలాంటి కథను సిద్ధం చేశారో చూడాలని అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!