Site icon NTV Telugu

Ram-Pothineni : రామ్ పోతినేని షాకింగ్ నిర్ణయం..

Rampothineni

Rampothineni

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లో ప్రస్తుతం ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. చివరగా ఆయన ఎంతో నమ్మకంగా తీసిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా కోసం రామ్ తన సొంత శైలికి భిన్నంగా పాటలు రాయడం, ప్రమోషన్ల కోసం అహర్నిశలు శ్రమించినా, ఫలితం మాత్రం నిరాశపరిచింది. ఈ పరాజయం రామ్‌ను తీవ్రంగా ఆలోచింపజేసింది. దీని ప్రభావంతో ఆయన తన పారితోషికాన్ని కూడా తగ్గించుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో, రామ్ తన తదుపరి సినిమా విషయంలో ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Sreeleela : తమిళంలో మరో సినిమాకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్?

నిజానికి, సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త దర్శకుడు కిశోర్‌తో తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించాల్సి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో తొందరపడకూడదని భావించిన రామ్, ఆ ప్రకటనను వాయిదా వేశారు. సినిమా బడ్జెట్‌ను భారీగా తగ్గించడంతో పాటు, స్క్రిప్ట్‌లో స్వయంగా మార్పులు చేస్తూ సమయం తీసుకుంటున్నారు. హిట్ కొట్టడం ఎంత ముఖ్యమో గుర్తించిన రామ్, ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి కొత్త కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కొంతకాలం విరామం తీసుకుని, పక్కా మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్‌తో మళ్లీ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని రామ్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చేదు జ్ఞాపకాలను చెరిపివేసేలా రామ్ తన తదుపరి అడుగులు వేయబోతున్నారు.

Exit mobile version