Site icon NTV Telugu

Burj Khalifa: బుర్జ్ ఖలీఫాపై రాముడి చిత్రం.. సోషల్ మీడియాలో వైరల్..

Burj Khalifa

Burj Khalifa

అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లాల్లా ప్రాణప్రతిష్టతో బాలరాముడు కొలువుదీరాడు. దీంతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ వేడుకలను జరుపుకున్నారు. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాతో సహా ఇతర దేశాల్లో, ఎన్ఆర్ఐలు ఈ వేడుకలను నిర్వహించారు. కొన్ని చోట్ల మిఠాయిలు పంచగా.. మరి కొన్ని చోట్ల కార్లతో ర్యాలీ చేపట్టారు. కాగా, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో రాముడి చిత్రం కనిపించే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Devara: సైఫ్ కి షూటింగ్ లో గాయాలు… త్వరగా తిరిగి వచ్చేయండి భైరా

అయితే, రాంలాలా ప్రాణప్రతిష్ట సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై రాముడి ప్రతిరూపాన్ని ప్రదర్శించే ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే, ఇంతకీ ఈ చిత్రం నిజమా? లేక ఎడిట్ చేసిన ఫోటో వైరల్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. బుర్జ్ ఖలీఫా స్టాక్ ఫోటోపై శ్రీరాముడి చిత్రాన్ని సూపర్మోస్ చేయడం ద్వారా ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Read Also: Ram Mandir : తొందరపడకండి.. పదిరోజుల్లో అయోధ్యకి ఫ్లైట్ టికెట్ 70శాతం తగ్గుద్ది

కాగా, వైరల్ అవుతున్న రాముడి చిత్రంపై నెట్టిం విభిన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే, బుర్జ్ ఖలీఫాపై రాముడి ఫోటోను ప్రదర్శిస్తే.. దాని అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేస్తుందని నెటిజన్స్ వ్యాఖ్యనిస్తున్నారు. మరి కొందరు మాత్రం రాముడి ఫోటో బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం నిజంగా గర్వించదగ్గ విషయం అని వెల్లడిస్తున్నారు.

Exit mobile version