Site icon NTV Telugu

Veekshanam: రామ్ కార్తీక్ హీరోగా ‘వీక్ష‌ణం’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..

Vikshanam

Vikshanam

Veekshanam: ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ ప‌ల్లేటి ద‌ర్శ‌క‌త్వంలో యువ క‌థానాయ‌కుడు రామ్ కార్తీక్, క‌శ్వి జంట‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వీక్ష‌ణం’. పి. ప‌ద్మ‌నాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంబంధించి తాజాగా ఫ‌స్ట్ లుక్‌ ను మేక‌ర్స్ ఆదివారం విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ లో చిమ్మ‌చీక‌టిలో బైనాకుల‌ర్స్ నుంచి వ‌స్తోన్న కాంతిలో హీరో రామ్ కార్తీక్ నిలుచుకుని ఉండడం గమనించవచ్చు. ఇకపోతే., పోస్ట‌ర్‌ తోనే మూవీ మేక‌ర్స్ సినిమా కంటెంట్ ఎంత డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతుంద‌నే న‌మ్మ‌కాన్ని వారు క్రియేట్ చేశారు.

Sinus Problem: సైనస్ సమస్యకు అసలు కారణమేంటో తెలుసా.?

సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకునట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైందట. ఈ చిత్రానికి స‌మ‌ర్ధ్ గొల్ల‌పూడి సంగీతాన్ని అందిస్తున్నారు. సాయిరామ్ ఉద‌య్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ ను అందిస్తామ‌ని మూవీ మేక‌ర్స్ తెలియ‌జేశారు. ఇక ఈ సినిమాకు ఎడిటర్ గా జెస్విన్ ప్రభు, పి.ఆర్‌.ఒ గా నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణికందుకూరి (బియాండ్ మీడియా) లు పని చేసారు.

Exit mobile version