NTV Telugu Site icon

Ram Gopal Varma: రాజకీయాల్లోకి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వర్మ..

Rgv Den

Rgv Den

తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే.. బయోగ్రఫీలు, రాజకీయాలు, నిజ జీవిత ఘటనలే ఆధారంగా ఆయన చేస్తున్న ప్రతీ సినిమా దుమారాన్నే రేపుతోంది.. ఒకప్పుడు టాలివుడ్, బాలివుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలను చేశాడు.. ఇటీవలి కాలంలో వివాదాస్పద మూవీలనే చేస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలను చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కథాంశంగా ప్రస్తుతం ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇకపోతే ఆర్జీవీ హైదరాబాద్‍లో కొత్త ఆఫీస్‍ను ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి డెన్ అని పేరు పెట్టాడు. ఈ ఆఫీస్ వీడియోను ఆఫీస్ టూర్ అంటూ పోస్ట్ చేశాడు ఆర్జీవీ.. హైదరాబాద్‍లో ఓ బిల్డింగ్ మొత్తాన్ని ఆర్జీవీ తన ఆఫీస్‍గా చేసుకున్నాడు. దీనికి డెన్ అని పేరు పెట్టాడు. ఈ ఆఫీస్ బిల్డింగ్‍కు ముందు భాగంలో ఆర్జీవీ కుర్చీలో కూర్చొని ఉన్న ఫొటో పెద్దగా ఉంది.. ఇలా మొత్తం తన సినిమాలు, స్పెషల్ ఫొటోలతో నింపేశాడు. ఈ డెన్ కు సంబందించిన వీడియోలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారంలో ఉన్నాయి.. దీనిపై విమర్శలు వస్తున్నా వర్మ తగ్గేదేలే అంటున్నాడు..

ఇది ఇలా ఉండగా.. వర్మ ఎన్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సంచలన విషయాలను పంచుకున్నాడు.. తన సినీ లైఫ్ నుంచి ఇప్పటివరకు ఎన్నో విషయాలను పంచుకున్నాడు.. అందులో భాగంగానే యాంకర్ రాజకీయాల పై సినిమాలు చేస్తున్నారు.. కదా వారికి అమ్ముడు పోయారా అని అడగ్గా వర్మను కొనలేరు.. సినిమాకోసం తప్ప వేరే ఉద్దేశ్యం లేదని చెప్పాడు.. అలాగే రాజకీయ ప్రవేశం గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా అనే ప్రశ్న ఎదురైంది.. దానికి వర్మ అలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పాడు.. ప్రజలకు సేవ చెయ్యడం నాకు రాదు.. నాకు నేనే సేవ చేసుకుంటాను అంతే అంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ అనేది లేదంటూ ఎన్నో విషయాలను బయటపెట్టాడు.. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వర్మ మాటల్లోనే ఆ నిజాలను మీరు ఒకసారి చూసేయ్యండి..