మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి.. ఇప్పటికే డైరెక్టర్ బుచ్చిబాబు ఫస్ట్ హాఫ్‍ను లాక్ చేసినట్లు వార్తలు వస్తుండగా.. షూటింగ్ మాత్రం అనుకున్న సమయానికి పూర్తయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పెద్ది షూటింగ్ ఇంకా నెల రోజుల వర్క్ బ్యాలెన్స్ ఉందట. దాంతో ముందుగా మార్చి 27న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. షూటింగ్ డిలే కారణంగా ఆ డేట్ కు రావట్లేదు. రెండు నుంచి మూడు నెలలు వెనక్కి వెళ్లి మే లేదా జూన్ నెలలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది.
కానీ ఇప్పడు లేటెస్ట్ గా వినిపిస్తిన్న సమాచారం ప్రకారం పెద్ది సినిమాను ఏకంగా దసరాకు పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం. యూనిట్ సభ్యుల నుండి వినిపిస్తున్న దాని ప్రకారం ఇంకా షూట్ చాలా పెండింగ్ ఉంది ప్రస్తుతానికైతే ఫస్టాఫ్ మాత్రమే లాక్ చేసి రెహమాన్ కు ఆర్ ఆర్ చేసేందుకు ఇచ్చారు. అలాగే సెకండాఫ్ లో ఓ స్పెషల్ సాంగ్ కూడా షూట్ చేయాల్సి ఉంది అని తెలిపారు. నెక్స్ట్ షెడ్యూల్‌ని యూరప్‌లో ప్లాన్ చేస్తున్నారు. అక్కడ చరణ్‌పై ఓ సాంగ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారు. మరోవైపు ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. సంక్రాంతికి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా పోస్ట్ ఫోన్ అవడంతో సాంగ్ రిలీజ్ కూడా వాయిదా వేశారు.
