Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ మాస్ డ్రామా పెద్ది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు లీక్ భారిన పడింది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్ నుండి ఫోటోలు లేదా ఆడియో క్లిప్స్ బయటకు రావడం సహజం. ‘పెద్ది’ విషయంలో కూడా ఒక మాస్ బీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది ఈ సినిమాలోని ఐటమ్ సాంగేనని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇటీవల ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా శృతి హాసన్ ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయబోతుంది. భారీ సెట్స్ మధ్య పెద్ది స్పెషల్ ఐటం సాంగ్ ను షూట్ చేస్తుండగా చరణ్ – శృతి హాసన్ రిహార్సల్స్ చేస్తున్న టైమ్ లో కొందరు మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ లీక్ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్న ఈ వీడియోను ఎవరో కావాలని ఎవరికీ కనిపించకుండా టాప్ యాంగిల్ నుండి సీక్రెట్ గా రికార్డ్ చేసి రిలీజ్ చేసారు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న పెద్ది ఈ ఏడాది జూన్ 25న భారీ స్థాయిలో విడుదల కానుంది.