రామ్ చరణ్ తేజ ఇటీవల కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. తాను ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అయ్యప్ప మాలలో ఉన్నా సరే ఇక్కడికి వచ్చానని ఆయన ప్రకటించారు. కడప దర్గా సందర్శించిన ఆయన అక్కడ దర్గా నియమాల ప్రకారం పూజలు నిర్వహించారు. ఇక ఆయన అయ్యప్ప మాలలో ఉండడంతో అసలు అయ్యప్ప దీక్షధారులు శవం ఎదురొస్తేనే పక్కకి తప్పుకోవాలి, అలాంటిది ఆయన ఏకంగా ఇలా దర్గాకి వెళ్లడం ఏమిటి అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కొంత మంది విమర్శలు వర్షం కూడా కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద రాంచరణ్ భార్య ఉపాసన స్పందించారు. రామ్ చరణ్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టారు. దేవుడిపై విశ్వాసం అందర్నీ ఏకం చేస్తుందని చిన్నాభిన్నం చేయదని ఆమె పేర్కొన్నారు.
Also Read: Sankranthiki Vastunnam: సంక్రాంతికి వస్తున్నారు .. ఆరోజే రిలీజ్
భారతీయులు అందరూ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారని ఐకమత్యంలోనే బలం ఉందని ఆమె ఈ సందర్భంగా రాస్కొచ్చింది. రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తారని కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. వన్ నేషన్ వన్ స్పిరిట్ అని ఆమె హ్యాష్ ట్యాగ్ కూడా జత చేసింది. అయితే నిజానికి అయ్యప్ప దీక్ష దారులు ఇరుముడి ధరించిన తర్వాత శబరిమలకు వెళ్లే దారిలో ఉన్న వావర్ అనే ముస్లిం దర్గాను దర్శిస్తారు. ఏరుమేలిలో ఉన్న వావర్ స్వామి దర్గా సందర్శించడమే కాదు అక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కలు చెల్లించి అప్పుడు శబరిమలకు పయనం అవుతారు. అలా అయ్యప్ప దీక్షధారులందరూ దర్గాను దర్శించేటప్పుడు ఈ దర్గాను దర్శించడం ఎందుకు తప్పు అవుతుంది? అంటూ రాంచరణ్ అభిమానించేవారు కొందరు కామెంట్ చేస్తున్నారు.