NTV Telugu Site icon

Ram Charan-Upasana: అద్భుతమైన 11 సంవత్సరాలు.. ఉపాసన కొణిదెల ట్వీట్ వైరల్!

Untitled Design (2)

Untitled Design (2)

Ram Charan and Upasana celebrates 11th Marriage Anniversary: బుధవారం టాలీవుడ్‌ ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల పెళ్లిరోజు. నిన్న వారు 11వ వివాహా వార్షికోత్సవం వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య ఉపాసనతో కలిసి ఉన్న ఫోటోలను రామ్ చరణ్ అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు ఉపాసన కూడా ఓ ఫోటో ట్వీట్ చేసి ‘అద్భుతమైన 11 సంవత్సరాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్, ఉపాసన పెళ్లిరోజు సందర్భంగా అభిమానులు ఈ జంటకు శుభకాంక్షలు చెబుతున్నారు.

ఈ పెళ్లి రోజు రామ్ చరణ్, ఉపాసన కొణిదెలకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఈ యేడాది మెగా ఇంట్లోకి మరో కొత్త వ్యక్తి రానున్నారు. త్వరలోనే చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. జూలైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఆ క్షణ కోసం మెగా కుటుంబ సభ్యులు మరియు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత కొద్ది రోజులుగా చిరంజీవి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్న విషయం తెలిసిందే.

Also Read: Infinix Note 30 5G Launch: 108MP కెమెరాతో వస్తున్న ఇన్ఫీనిక్స్‌ 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర 15 వేలు మాత్రమే!

రామ్ చరణ్, ఉపాసన ఎన్నో ఏళ్లు ప్రేమించుకొని..ఇరువురు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒకటయ్యారు. వీరిద్దరు 2012 జూన్ 14న పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరి పెళ్లి అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా జరిగింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంచర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని ఉపాసన నిర్వహిస్తున్నారు.

 

Show comments