NTV Telugu Site icon

Upasana -Ramcharan : ఒమన్ లో ఉపాసన, రామ్ చరణ్.. ఏమున్నాడు మావా…!

Upasanaaaaa

Upasanaaaaa

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన సమయం దొరికితే ట్రిప్ లకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే.. రామ్ చరణ్ కు భార్య అంటే చాలా ప్రేమ ఎప్పుడు భార్యతో వేకెషన్స్, ఫ్యామిలీ ట్రిప్ వెళ్తాడు.. తాజాగా గేమ్ చేంజర్ షూటింగ్ కు గ్యాప్ రావడంతో ఒమన్ దేశానికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఉపాసన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రామ్ చరణ్ గురించి ఏదోకటి పోస్ట్ చేస్తుంది.. తాజాగా వేకేషన్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

తాజాగా చరణ్ – ఉపాసన క్లింకారా తో కలిసి ఒమన్ దేశానికి వెళ్లారు. ఉపాసన ఫ్యామిలీకి చెందిన జైదుస్ అనే కంపెనీ వర్క్ మీద వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఉపాసన ఫ్యామిలీ, బంధువులు కూడా వీరితో కలిసి సందడి చేసారు. ఒమన్ దేశంలో ఉపాసన చరణ్ తో పాటుగా ఉపాసన ఫ్యామిలి మెంబెర్స్ కు ఉన్నారు.. ఆ ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికోస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమా తర్వాత బుచ్చి బాబుతో మరో సినిమా చెయ్యబోతున్నాడు.. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలను పూర్తి చేసుకుంది.. ఇక ఆ తర్వాత సుకుమార్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు..