‘గేమ్ ఛేంజర్’ సినిమా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు అని గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. తన నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోందని, గేమ్ ఛేంజర్ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని పేర్కొన్నారు. డైరెక్టర్ ఎస్ శంకర్ ‘కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని, ఆయనతో పని చేయడం తన అదృష్టం అని చెప్పారు. టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు ఈ ఈవెంట్‌కు వచ్చి మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని రామ్ చరణ్ తెలిపారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నేడు గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరిగింది. ఈవెంట్‌లో రామ్ చరణ్, శంకర్, సుకుమార్ పాల్గొని మాట్లాడారు. ‘శంకర్ గారు చేసిన స్నేహితుడు సినిమాకు నేను గెస్టుగా వెళ్లా. ఆ సమయంలో ఆయనతో మాట్లాడేందుకు చాలా టెన్షన్ పడ్డా. నాతో కాకపోయినా.. తెలుగులో ఎవరితో అయినా ఓ తెలుగు సినిమా చేయమని అడుగుదామని కూడా అడగలేకపోయా. శంకర్ గారు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలా. ఆయన డైరెక్టర్లకే డైరెక్టర్. అలాంటి శంకర్ గారితో పని చేయడం నా అదృష్టం అనే చెప్పాలి. నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి 5 ఏళ్లు అవుతోంది. అందుకే గేమ్ ఛేంజర్ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. దిల్ రాజు గారితో పని చేయడం ఆనందంగా ఉంది. సుకుమార్ గారు ఈ ఈవెంట్‌కు వచ్చి మాట్లాడటం సంతోషం’ అని చరణ్ చెప్పారు.
Also Read: Game Changer: ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్.. రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు పక్కా: సుకుమార్ రివ్యూ
2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో కియారా అడ్వాణీ కథానాయిక. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, ప్రకాశ్‌రాజ్, జయరామ్, సునీల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.