NTV Telugu Site icon

Ram Charan : ముంబైలో సందడి చేసిన రామ్ చరణ్..వీడియో వైరల్ ..

Ram (2)

Ram (2)

టాలివుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకేక్కిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.. నార్త్ లో చాలామంది చరణ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. తాజాగా రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి ముంబైకు వెళ్లినట్లు తెలుస్తుంది.. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ దగ్గర రామ్ చరణ్ కనిపించిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో రామ్ చరణ్ కొంతమంది ఫ్యాన్స్ తో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత అక్కడ నుంచి స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం మనం చూడవచ్చు.. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో రామ్ చరణ్ ముంబైలో ఉన్నారని తెలుస్తుంది.. అసలు ముంబైకి ఎందుకు వెళ్లారో అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.. మరికొందరు మాత్రం బాలివుడ్ లో సీక్రెట్ గా సినిమా చేస్తున్నారేమో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..

ఇక సినిమాల విషయానికొస్తే.. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. ఓ షెడ్యూల్ ని పూర్తి చేసిన మూవీ టీమ్ తదుపరి షెడ్యూల్ ని వైజాగ్ లో ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫాన్స్ ఈ విషయంలో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.. ఫస్ట్ సింగిల్ గురించి ప్రకటించినప్పటికి, ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, ఎస్.జే. సూర్య, సముద్రఖని, నాజర్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు..