NTV Telugu Site icon

Ram charan : ఓటు వేసేందుకు హైదరాబాద్ కు బయలుదేరిన రామ్ చరణ్..

Ram Charann (2)

Ram Charann (2)

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఓటింగ్ లో పాల్గొననున్నారు.. ఇప్పటికే షూటింగ్ లలో బిజీగా ఉన్న సినీ స్టార్స్ మొత్తం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ కు బయలుదేరినట్లు ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ‘గేమ్ చేంజర్ ‘ సినిమాలో నటిస్తున్నాడు..చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం కర్ణాటక మైసూర్ లో ఉన్నాడు.. ఎన్నికలు కారణంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికే హైదరాబాద్ వచ్చినట్లు రామ్ చరణ్ అన్నారు.. చెర్రీ హైదరాబాద్ చేరుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక సెలెబ్రేటీలు కూడా ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెలుపుతున్నారు..

ఇకపోతే ఏ హీరో ఎక్కడ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు అంటే.. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవితో పాటు పలువురు ఓటింగ్ లో పాల్గొననున్నారు. తమ రహస్యమైన ఓటును ఇష్టమైన అభ్యర్థికి వేయనున్నారు..జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 165లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓటు వేయనున్నారు.. అలాగే రామ్ చరణ్, చిరంజీవి, నితిన్ లు జూబ్లీహిల్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 149లో మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.. ఓబుల్ రెడ్డి స్కూల్ నందు గల పోలింగ్ బూత్ నంబర్ 150లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓటు వేయనున్నారు..బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ నంబర్ 153లో అల్లు అర్జున్ ఓటు వేయనున్నారు. డార్లింగ్ ప్రభాస్ కూడా మణికొండలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రభాస్ ఓటు వేయనున్నాడు.. పలువురు సెలెబ్రేటీలు జూబ్లీహిల్స్ పరిధిలో ఎక్కువగా ఓటు వేయనున్నారు..