మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వైపు వరుస సినిమాలు మరోవైపు వాణిజ్య ప్రకటనలతో ఫుల్ బిజీగా ఉన్నాడు… త్రిఫుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అవ్వడంతో పాటుగా గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈ సినిమా అద్భుతమైన నటనతో భారతీయులను, హాలీవుడ్ సినీ ప్రముఖులను, విదేశీలను మంత్రముగ్దులను చేశాడు.. ఇప్పుడు యావత్ ప్రేక్షకులు చెర్రీ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఈ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు చరణ్. మెగాస్టార్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లోకి రాకముందు చరణ్ బిజినెస్ రంగంలో ముందున్నాడు.. అతనికి వాచ్ లన్నా, కొత్త కొత్త మోడల్ కార్లన్నా చాలా ఇష్టం ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఆయన గ్యారేజీలో చాలా కార్లు ఉన్నాయి..
అతని వద్ద ఉన్న కార్స్ కలెక్షన్స్ లో ఫెరారీ పోర్టోఫినో ఒకటి. ఇటీవల తనకు ఇష్టమైన ఫెరారీ పోర్టోఫినో రెడ్ కలర్ కారులో కనిపించాడు చరణ్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆ కారు స్టైలీష్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.. ఆ కారు మోడల్ కూడా చూపరులను తెగ ఆకట్టుకుంది.. అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఈ కారు ధర దాదాపు రూ.3.5 కోట్లు ఉంటుందని సమాచారం.. కొన్నేళ్ల క్రితం దీనిని రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల, హైదరాబాద్లోని తన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు తీసిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరలవుతుంది.. ఇదే కాదు చెర్రీ లిస్టులో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి.. ఇక కేరీర్ విషయానికొస్తే.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు చరణ్..డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆర్సి 16లో నటించనున్నారు. ఇవే కాకుండా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటించనున్నారు..