గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదలపై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మార్చి చివర్లో సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, సినిమాకు సంబంధించి ఇంకా దాదాపు 30 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని మార్చి కల్లా థియేటర్లలోకి రావడం అంటే చిత్ర యూనిట్‌కు పెద్ద సవాలే అని చెప్పాలి. ఎందుకంటే క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని దర్శకుడు భావిస్తే మాత్రం, షూటింగ్ ఆలస్యమై సినిమా ఏప్రిల్ లేదా మే నెలలో వచ్చే సమ్మర్ రేసులోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరి రామ్ చరణ్ తన వేగాన్ని పెంచి అనుకున్న సమయానికే ‘పెద్ది’గా పలకరిస్తాడా? లేక మెగా ఫ్యాన్స్ మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
