Site icon NTV Telugu

Peddi Second Song: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడంటే!

Peddi

Peddi

Peddi Second Song: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మెగా ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ అందరూ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఏకంగా 200మిలియన్ కి పైగా వ్యూస్ అందుకున్న సంగతి తెలిసిందే. తర్వాతి సాంగ్ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఆసక్తిగా వేయిట్ చేస్తున్నారు.

READ ALSO: Jawa 730 Twin Revealed: 75 HP పవర్‌తో జావా కొత్త లుక్ అదిరింది.. 730cc ఇంజిన్, బ్రెంబో బ్రేక్స్‌తో ‘మోడ్రన్ రెట్రో’ బైక్..

ఈ సినిమా సెకండ్ సింగిల్ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్‌గా మారింది. పలు నివేదికల ప్రకారం.. మేకర్స్ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ సాంగ్ పక్కా మాస్ అని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంకా దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కూడా భాగమైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏప్రిల్ 30న గ్రాండ్‌గా రిలీజ్‌కి కాబోతుంది.

READ ALSO: Shocking Wedding Twist: పెళ్లి మండపంలో ఊహించని ట్విస్ట్.. రూపాయి కట్నం తీసుకొని వివాహం!

Exit mobile version