Peddi: రామ్ చరణ్ గాయంపై ‘పెద్ది’ టీమ్ అఫీషియల్ క్లారిటీ! షూటింగ్‌కు నో బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi: ‘పెద్ది’ షూటింగ్ సెట్‌లో రామ్ చరణ్‌కు గాయమైందన్న వార్త సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఉలిక్కిపడ్డారు. దీంతో చిత్ర యూనిట్ వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరుగుతున్న షూటింగ్‌లో భాగంగా ఒక హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన షూటింగ్‌లో రామ్ చరణ్ ఎడమ కంటి పైభాగంలో చిన్న కోత పడింది. వెంటనే వైద్యులు స్పందించి ఆయనకు చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ కంటికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వైద్యులు ధృవీకరించారు.
READ ALSO: Iran Attack On USS Abraham Lincoln: అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. వార్నింగ్ ఇచ్చిన గంటకే ఇలా..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
వైద్యులు కనీసం రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, రామ్ చరణ్ తన డెడికేషన్‌ను చాటుకున్నారు. షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఆయన రేపటి నుంచే సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు చిత్ర బృందం తాజా ప్రకటనలో వెల్లడించింది. తాజా ప్రకటనలో “అంతా క్షేమంగా ఉంది, షూటింగ్ యధావిధిగా కొనసాగుతోంది” అని అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో వస్తున్న అనవసర ఊహాగానాలను నమ్మవద్దని టీమ్ కోరింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీ-స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్‌లో ఉంది. త్వరలోనే ఒక స్పెషల్ సాంగ్ షూట్ ప్రారంభం కానుంది. చరణ్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని, సినిమా సకాలంలో థియేటర్లలోకి రావాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
An update regarding @AlwaysRamCharan Garu's injury on the sets of #Peddi.
We promise everything is safe and on track ❤️
Kindly do not speculate. Thank you. pic.twitter.com/5Abhs2QyHb
— PEDDI (@PeddiMovieOffl) March 25, 2026
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!