Site icon NTV Telugu

Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..

Peddi Ramcharan

Peddi Ramcharan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్వకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) చిత్రంపై నెలకొన్న సస్పెన్స్ ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది. తొలుత మార్చిలో రావాల్సిన ఈ చిత్రం, షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏప్రిల్ నెలలోకి అడుగుపెట్టి 10 రోజులు గడుస్తున్నా, ప్రమోషన్ల విషయంలో మేకర్స్ సైలెంట్‌గా ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మళ్ళీ వాయిదా పడటం దాదాపు ఖాయమైపోయింది.

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించాల్సిన డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడక్షన్ టీం నుండి “బుకింగ్స్ హోల్డ్ లో పెట్టండి” అని సమాచారం అందడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఐపీఎల్ ఫీవర్, షూటింగ్ లో ఇంకాస్త ప్యాచ్ వర్క్, ఒక స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉండటంతో ‘పెద్ది’ని జూన్ చివరి వారానికి వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రాకపోవడంతో అఖిల్ ‘లెనిన్’ వంటి ఇతర సినిమాలు కూడా తమ డేట్స్ మార్చుకుంటూ సందిగ్ధంలో పడ్డాయి. మరి ఈ మెగా బాక్సాఫీస్ గర్జన ఎప్పుడు వినిపిస్తుందో తెలియాలంటే మేకర్స్ నుండి వచ్చే అధికారిక ప్రకటన వరకు ఆగాల్సిందే!

Exit mobile version