Tillu Square: టిల్లుగాడిపై ప్రశంసలు కురిపించిన రామ్ చరణ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan on Tillu Square: ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్క్వేర్’. ఈ చిత్రంకు మల్లిక్ రామ్ దర్శకుడు కాగా.. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యూత్‌ఫుల్, రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రంగా వచ్చిన టిల్లు స్క్వేర్.. మార్చి 29న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
టిల్లు స్క్వేర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి టిల్లుగాడిని మెచ్చుకోగా.. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అభినందించారు. సిద్ధూ బాగా నటించాడని ప్రశసించారు. టిల్లు స్క్వేర్ సాధించిన అద్భుత విజయం పట్ల తనకు చాలా గర్వంగా ఉందని చరణ్ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన సిద్ధూ.. మీ అద్భుత విజయం పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ విజయం సాధించిన అనుపమ పరమేశ్వరన్, మల్లిక్ రామ్, సంగీత దర్శకులు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Also Read: Premalu OTT: ప్రేమలు ఓటీటీ రిలీజ్‌లో ట్విస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి అదరగొడుతోంది. రూ.100 కోట్ల మార్కును దాటేసింది. టిల్లు స్క్వేర్ మూవీకి సిద్దు జొన్నలగడ్డ, రవి ఆంథోనీ స్క్రిప్ట్ అందించారు. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి, భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమాలో మురళీ శర్మ, మురళీధర్ గౌడ్, నేహా శెట్టి, ప్రిన్స్ కీలక పాత్రలు పోషించారు.
Dear Siddhu, so proud of your phenomenal success. My heartfelt congratulations to Anupama, Mallik Ram, the music directors, Sithara Entertainments and the entire team on this success.#TilluSquare #Siddu @anupamahere @MallikRam99 @Ram_Miriyala @NavinNooli @vamsi84 @SitharaEnts pic.twitter.com/e8Ywmmtmh5
— Ram Charan (@AlwaysRamCharan) April 7, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!