NTV Telugu Site icon

Game Changer : గేమ్ ఛేంజర్.. థర్డ్ సాంగ్ వచ్చేస్తోంది!

Game Changer

Game Changer

Game Changer : స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో.. గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో.. ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా రిలీజ్ చేసిన మాస్ సాంగ్ రా మచ్చా మచ్చా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండ్ అవుతూ మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్స్‌కి పైగా వ్యూస్ క్రాస్ చేసింది. ఇక అంతకుముందు రిలీజ్ చేసిన జరగండి సాంగ్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ పాట వినడం కంటే.. చూడ్డానికి విజువల్ పరంగా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి సంగీత దర్శకుడు తమన్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. అలాగే.. థర్డ్ సింగిల్ అప్డేట్ కూడా ఇచ్చాడు.

Read Also:India Women vs NZ Women: నేటి నుంచే టీమిండియా టి20 మహిళా ప్రపపంచకప్ వేట!

రా మచ్చా జోష్‌లో ఈ అక్టోబర్‌లోనే థర్డ్ సాంగ్ రిలీజ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే.. ఈసారి పక్కా హార్ట్ వార్మింగ్ మెలోడి సాంగ్ రానుందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే.. నవంబర్ నుంచి గేమ్ ఛేంజర్ గ్లోబల్ రేంజ్ వైబ్ స్టార్ట్ అవుతుందని పోస్ట్ చేశాడు. దీంతో.. వెయిటింగ్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమా సంగతేమో గానీ.. పాటలు మాత్రం పీక్స్‌లో ఉంటాయని ముందు నుంచి చెబుతు వస్తోంది చిత్ర యూనిట్. కేవలం పాటల కోసమే శంకర్ 90 కోట్లు ఖర్చు చేశాడంటే.. ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. తమన్ ఈ రేంజ్ హైప్ ఎక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. కియారీ అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నట్టు.. ఈ దసరా సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి టీజర్ బయటికొచ్చే ఛాన్స్ ఉంది.

Read Also:War 2 : భారీ సెట్లో ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో మాస్ సాంగ్..

Show comments