NTV Telugu Site icon

Ram Charan: రామ్‌ చరణ్‌కు ఇష్టమైన సినిమా, హీరోయిన్ ఎవరంటే?

Ram Charan

Ram Charan

Ram Charan Favourite Movie is Magadheera: ‘మెగా పవర్ స్టార్’ రామ్‌ చరణ్‌ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోని ర్యాపిడ్‌ ఫైర్‌లో పలు ప్రశ్నలు అడగ్గా.. చరణ్‌ సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన సినిమా మగధీర అని చెప్పారు. ‘ఆరెంజ్‌, రంగస్థలం చిత్రాలంటే నాకు ఇష్టం. మగధీర నా ల్యాండ్‌మార్క్‌ మూవీ. చాలామంది అభిమానులకు ఈ సినిమా అంటేనే చాలా ఇష్టం. అందుకే నేను కూడా మగధీర పేరే చెబుతా’ అని అన్నారు.

మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు.. ఒకరి పేరు ఎలా చెప్పగలను అని రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు. ఈతరం హీరోయిన్స్‌లో మాత్రం సమంత అంటే ఇష్టం అని చెప్పారు. ఇష్టమైన హీరో పేరు అడగ్గా.. కోలీవుడ్‌ స్టార్‌ సూర్య పేరు చెప్పుకొచ్చారు. తనకు రొమాంటిక్‌ కంటే యాక్షన్‌ సినిమాలు అంటేనే ఎక్కువగా ఇష్టం అని చరణ్‌ తెలిపారు. తాను కామెడీ ఎప్పుడూ చేయలేదని, బుచ్చిబాబుతో చేస్తోన్న సినిమా ఈ జానర్‌లోనే ఉంటుందన్నారు.

Also Read: Guinness World Record: గిన్నిస్‌ రికార్డుల సంఖ్య.. సచిన్‌ను అధిగమించిన ఢిల్లీ వాసి!

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో రామ్‌ చరణ్‌ ‘ఆర్‌సీ 16’ చేస్తున విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ చిత్రంను మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో తెరకెక్కుతోంది. ఇందులో చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కనిపించనున్నారు. మరోవైపు ‘గేమ్‌ ఛేంజర్‌’తో చరణ్ బిజీగా ఉన్నారు. ఎస్ శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

Show comments