NTV Telugu Site icon

Ram Charan: రామ్‌ చ‌ర‌ణ్‌కి అరుదైన గౌర‌వం.. మొదటి భారత సెలబ్రిటీగా!

Ram Charan Iffm 2024

Ram Charan Iffm 2024

Ram Charan named the Guest of Honour for IFFM 2024: ‘గ్లోబల్ స్టార్’ రామ్‌ చ‌ర‌ణ్‌కి అరుదైన గౌర‌వం దక్కింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ 15వ ఎడిషన్‌లో చరణ్‌ పాల్గొననున్నారు. అతిథిగా వెళ్లడమే కాకుండా.. భారత సినిమాకి చేసిన సేవలకు గాను ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ అవార్డు అందుకోనున్న మొదటి భారతీయ సెలబ్రిటీ మనోడే కావడం విశేషం.

‘అందరికీ ఓ శుభవార్త. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2024కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారు. నాటు నాటుకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి’ అని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ పేర్కొంది. ఈ విషయంపై రామ్ చరణ్ స్పందిస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌ 2024లో నేను కూడా ఒక భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. ఆర్ఆర్ఆర్ విజయం చిన్నది కాదు.. విశ్వ‌వ్యాప్తం. ఈ క్షణాన్ని మెల్‌బోర్న్‌ ఆడియెన్స్‌తో షేర్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నా’ అంటూ చరణ్ తెలిపారు. విక్టోరియన్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు ఫెస్టివల్‌ జరగనుంది.

Show comments