NTV Telugu Site icon

Game Changer : గేమ్ ఛేంజర్.. థర్డ్ సాంగ్ లెక్క వేరే?

New Project (62)

New Project (62)

Game Changer : ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ నుంచి రెండు పాటలు విడుదల అయ్యాయి. ఈ రెండు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. జరగండి సాంగ్ లీక్ అవగా.. అదే పాటను ముందుగా రిలీజ్ చేశారు. కాకపోతే.. లీక్ అయిన సాంగ్, అఫీషియల్‌గా రిలీజ్ చేసిన సాంగ్ సింగర్స్ వేరు. కానీ లీక్డ్ వెర్షన్ వోకల్స్ బాగున్నాయనే టాక్ రావడంతో.. సినిమాలో అదే సాంగ్ ఉంటుందని తమన్ చెబుతున్నాడు. ఈ పాట చూడ్డానికి విజువల్ పరంగా శంకర్ మార్క్ స్టైల్లో అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘రా మచ్చా’ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో 50 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకు థియేటర్లో మోత మోగుతుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు తమన్.

Read Also:PM Modi: బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

అక్టోబర్‌లోనే ఈ సాంగ్ రానుంది. అయితే ఈసారి పక్కా మెలోడి ఉంటుందని ఇప్పటికే తమన్ క్లారిటీ ఇచ్చేశాడు. కానీ ఈ పాట చాలా స్పెషల్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. చరణ్ తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే జరగండి సాంగ్‌లో చరణ్, కియారా జోడీని చూశాం. ఇప్పుడు థర్డ్ సింగిల్‌లో చరణ్, అంజలి జోడీని చూడబోతున్నాం. ఈ పాట చరణ్, అంజలి పై ఉంటుందని తెలుస్తోంది. ఈ సాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఉంటుందని అంటున్నారు. అంటే.. భారతీయుడు సినిమాలో తెప్పలెళ్లిపోయాక సాంగ్‌ టైప్‌లో ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే నిజమైతే.. గేమ్ ఛేంజర్‌తో శంకర్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చినట్టే. మరి ఈ సారి శంకర్, తమన్ ఎలాంటి పాటను రిలీజ్ చేస్తారో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే!

Show comments