NTV Telugu Site icon

Ram Charan : రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు విగ్రహం

New Project (23)

New Project (23)

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరాలు లేవు. తండ్రికి తగ్గ తనయుడిగా డ్యాన్స్ లు, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయనకు తాజాగా అరుదైన గౌరవం దక్కనుంది. ఆర్‎ఆర్‎ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఎదిగి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న చెర్రీ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్‌లో త్వరలో మెగా పవర్ స్టార్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మ్యూజియంలో చెర్రీ, అతని పెంపుడు కుక్క రైమి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని ఇటీవల జరిగిన ఐఐఎఫ్ఏలో మేడమ్ టుస్సాడ్స్ బృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు రామ్ చరణ్, రైమీల కొలతలు, ఫోటోలు తీయడం మనం చూడవచ్చు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. మేడమ్ టుస్సాడ్స్ కుటుంబంలో భాగమైనందుకు చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఘనత అందుకున్నారు. టాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్‌‌, మహేశ్‌, అల్లు అర్జున్‌ ల మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ లో కొలువు దీరాయి. అయితే రామ్ చరణ్ మైనపు విగ్రహం విషయంలో మాత్రం చాలా ప్రత్యేకత ఉంది.

Read Also: Bomb Blast: నిద్రిస్తున్న వీఆర్‌ఏ.. మంచం కింద బాంబులుపెట్టిన పేల్చి చంపేశారు..!

లండన్ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ జన్మస్థలంగా చరిత్ర కలిగి ఉంది. ఇప్పుడు అక్కడ అడుగు పెట్టిన తొలి తెలుగు హీరో అనే అరుదైన గౌరవాన్ని రామ్ చరణ్ అందుకోనున్నాడు. ప్రభాస్ (బ్యాంకాక్ మ్యూజియం), మహేష్ బాబు (సింగపూర్), అల్లు అర్జున్ (దుబాయ్) మైనపు బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలియగానే మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, జీ స్టూడియోస్‌, దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకాలపై దిల్‌ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Read Also:Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్‌ కేసు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ