NTV Telugu Site icon

Navneet Kaur Rana: ఒవైసీ సోదరులకు నవనీత్ కౌర్ మరో వార్నింగ్

Kour

Kour

అమరావతి ఎంపీ, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ మరోసారి ఒవైసీ సోదరులకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి వీధిలో రామభక్తులు, మోడీ సింహాలు ఉన్నాయని హెచ్చరించారు. పదేళ్ల క్రితం అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు నవనీత్‌కౌర్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. పాకిస్థాన్‌కు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదైంది. తాజాగా గతంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా నవనీత్‌కౌర్ తీవ్రంగా స్పందించారు. తమకు 15 సెకన్ల సమయం చాలంటూ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: IPL 2024 GT: శుభ్‌మన్ గిల్‌ అండ్ టీంకు షాకిచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ..

తన సోదరుడు అక్బరుద్దీన్ ఫిరంగి అంటూ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. దీనికి తాజాగా ట్విట్టర్ వేదికగా నవనీత్ స్పందించారు. అక్బరుద్దీన్ ఫిరంగి అయితే.. అలాంటి ఫిరంగులు మా ఇంటి బయట అలంకరణ కోసం ఉంచుతామని చెప్పారు. ఇక ఇండియాలో రామభక్తులు, మోడీ సింహాలు ప్రతి వీధిలో తిరుగుతున్నారన్నారు. తాను హైదరాబాద్ వస్తున్నానని.. తనను ఎవరు ఆపుతారో చూస్తానని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కేసు నమోదైన మరుసటి రోజే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

పదేళ్ల క్రితం పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే జనాభా లెక్కలు సరిచేస్తామంటూ 2013లో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నవనీత్ కౌర్‌.. తమకు 15 సెకన్ల సమయం చాలని నవనీత్ వ్యాఖ్యనించారు. మేము ముందుకు వస్తే.. 15 సెకన్ల సమయం పడుతుందని నవనీత్‌ తన ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ లో ఒవైసీ సోదరులను ట్యాగ్ చేశారు.

ఇది కూడా చదవండి: PVS Swetha: డైరెక్టర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ కొత్త అవతారం

హైదరాబాద్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత తరఫున ప్రచారం నవనీత్ ప్రచారం చేశారు. నాలుగుసార్లు లోక్ సభ ఎంపీగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ‌కి ప్రత్యర్థిగా బీజేపీ తరపున మాధవీలత పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపడం ఇదే తొలిసారి.

అసదుద్దీన్ 2004 నుంచి హైదరాబాద్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో తొలిసారి గెలిచారు. అంతక ముందు 1984 నుంచి ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ లోక్ సభ స్థానంతో పాటు గోషామహల్ మినహా హైదరాబాద్ లోని అన్ని అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం ఆధీనంలో ఉన్నాయి. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు మే 13న నాలుగో విడత పోలింగ్ జరగనుంది.