NTV Telugu Site icon

Rakul preeth Singh : స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతున్న రకుల్..

Whatsapp Image 2023 08 17 At 10.12.31 Am

Whatsapp Image 2023 08 17 At 10.12.31 Am

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌..టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ భామ 2011లో `కేరటం` అనే సినిమాతో టాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత సందీప్‌ కిషన్‌తో కలసి నటించిన `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌` సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా మంచి విజయం సాధించింది.. అంతే ఈ భామకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.. స్టార్‌ హీరోలతో వరుస సినిమాలు చేసింది.కేవలం 3 ఏళ్లలోనే దాదాపు 13 సినిమాల్లో నటించింది.. ఈ భామ అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది.వీరితోపాటు సీనియర్ హీరో నాగార్జున తో `మన్మథుడు 2`, నితిన్‌ తో `చెక్‌`, వైష్ణవ్‌ తేజ్‌తో `కొండపొలం` వంటి చిత్రాలు చేసింది. కానీ ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.. దీనితో ఈ భామకు బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.

హిందీలో ఈ భామ వరుసగా ఏడెనిమిది సినిమాలను చేసింది.కానీ అక్కడ కూడా రకుల్ కి అంత గా సక్సెస్‌ దక్కలేదు. ఏడాదికి  మూడు నాలుగు సినిమాలతో అలరించింది కానీ ఈ భామకు సక్సెస్ రాలేదు.ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక హిందీ లో `మేరి పత్న కా రీమేక్‌`, తమిళంలో `ఇండియన్ 2`.సినిమాలో నటిస్తుంది..తన అభిమానులకు సోషల్‌ మీడియా ద్వారా నిత్యం టచ్‌లోనే ఉంటుందీ ఈ బ్యూటీ.నిత్యం హాట్ ఫోటో షూట్లు చేసి వాటిని అభిమానులకు షేర్ చేస్తుంది.. గ్యాప్‌ లేకుండా అందాల దాడి చేసి ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం గా జాతీయ జెండాతో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు వైట్‌ అండ్‌ వైట్‌ లో అదరగొడుతుంది.వైట్‌ కోట్‌ మరియు వైట్ ఫ్యాంట్‌ ధరించి స్టన్నింగ్ పోజులిచ్చింది. క్యూట్ స్మైల్ తో ఎంతగానో ఆకట్టుకుంది.ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి