Rakul Preet Singh about Bharateeyudu 2: తన కెరీర్‌లోనే ‘భారతీయుడు 2’ బెస్ట్ సినిమా అవుతుందని స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర గొప్పగా ఉంటుందని, తన నిజ జీవితానికి దగ్గర పోలిక ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో తాను నటించలేదని రకుల్ చెప్పారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘భారతీయుడు 2’. భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో రకుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. భారతీయుడు 2లో తన పాత్ర గురించి చెప్పారు. ‘నా కెరీర్‌లోనే భారతీయుడు 2 బెస్ట్ సినిమా అవుతుంది. ఎందుకంటే ఇందులో నేను చేసిన పాత్ర అంత గొప్పగా ఉంటుంది. నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఆ పాత్ర ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. భారతీయుడు 2 షూటింగ్ మొత్తం గొప్ప అనుభూతినిచ్చింది. శంకర్ దర్శకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని విశేషాలను మీతో పంచుకోవాలని ఉంది. దానికి కాస్త సమయం పడుతుంది’ అని రకుల్ తెలిపారు.
Also Read: USA vs IND: శివమ్ దూబెపై వేటు.. ఐపీఎల్ స్టార్‌కు చోటు!
భారతీయుడు 2లో రకుల్ ప్రీత్ సింగ్ సహా సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న భారతీయుడు 2 చిత్రం జులై 12న విడుదల కానుంది. ఇక భారతీయుడు తప్ప రకుల్ సౌత్‌లో మరే సినిమాలు చేయడం లేదు. బాలీవుడడ్‌లో ప్రస్తుతం ‘దే దే ప్యార్ దే 2’ చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.